Monday 12 August 2013

మనసే అందాల బృందావనం..!



చిత్రం           : మంచి కుటుంబం (1968)
సంగీతం       : ఎస్పీ కోదండపాణి
రచన           : ఆరుద్ర
గానం           : పి. సుశీల
నటీనటులు  : కృష్ణ, కాంచన
దర్శకుడు     : వి. మధుసూధనరావు


Englishlo Ikkada Choodandi :)

మనసే అందాల బృందావనం..!

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

రాధను ఒక వంక లాలింతునే
సత్యభామను మురిపాల తేలింతునే
రాధను ఒక వంక లాలింతునే
సత్యభామను మురిపాల తేలింతునే
మనసార నెరనమ్ము తనవారినే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ....
మనసార నెరనమ్ము తనవారినే
కోటి మరులందు సుధలందు తనియింతునే..

మనసే అందాల బృందావనం
దనిస దని నిదదమ
మదని నిదదమ
గమద దమమగస
గగ మమ మగస దని
గసా మగా దమా నిద
గమదనిస బృందావనం

మాద మగస
దామ గమద
నీద నిసమ
గమ మద దనినిస
నిసమద మగస
గమ దనిసగ బృందావనం

సమగస గమదని
గదమగ మదనిస
మనిద మదనిస
ఆ...........

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం


Tuesday 6 August 2013

బంతి పూల జానకీ జానకీ..!



చిత్రం : బాద్ షా  (2013)
సంగీతం : తమన్ ఎస్.ఎస్.
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : దలేర్ మెహందీ , రాణినా రెడ్డి
నటీనటులు : జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్
దర్శకుడు : శ్రీను వైట్ల

Englishlo Ikkada Choodandi :)

బంతి పూల జానకీ జానకీ..!

కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురోయి

రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

ఆ బంతి పూల జానకీ జానకీ
నీకంత సిగ్గు దేనికి దేనికి
ఛలో లో నాతో వచ్చేయ్ అత్తారింటికి

రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

అ బంతి పూల జానకీ జానకీ
నీకంత సిగ్గు దేనికీ..
హేయ్ ఆకు వక్క సున్నముంది
నోరు పండడానికి
హేయ్ ఆడ ఈడ ముందరుంది
నీకు చెందడానికి
హేయ్ పుట్ట మీద తేనె పట్టు
మట్టిలోకి జారినట్టు
సోకులన్ని పిండుకుంటనే..

హేయ్ కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రోయ్.. ఓ...
హేయ్ కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రోయ్.. ఓ...

రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

చాపకింద నీరులాగ చల్లగా చల్లగా
చెంతకొచ్చినావు చెంప గిల్లగా గిల్లగా
చాప ముల్లు గుచ్చినావె మెల్లగా.. 
పాతికేళ్ల గుండె పొంగి పొర్లదా పొర్లదా
చూపులో ఫిరంగి గుళ్ల జల్లుగా
సిగ్గులన్ని పేల్చినావు ఫుల్లుగా ఫుల్లుగా
సంకురాత్రి కోడి సుర్ర కత్తి గట్టి 
దూకు దూకు దూకుతాందె కారంగా
శంకు మార్కు లుంగి పైకి ఎత్తి కట్టి
ఎత్తుకెళ్లిపోర నన్ను ఏకంగా
హేయ్.. ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్త మీదికి
ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారు గుట్టు మట్టు 
నిన్ను చూసి ఫట్టుమందిరో.. 

కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రోయ్.. ఓ...
కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రోయ్.. ఓ...
రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

అంతలేసి తొందరేంది పిల్లడా పిల్లడా
అందమంత పట్టినావు జల్లెడా జల్లెడా
కొంగు పట్టులోని పాల మీగడా
ఆకలేసి నంజుకోన అక్కడా అక్కడా
నీకు లాంటి పిల్లగాన్ని ఎక్కడా
చూడలేదె కంచిపట్టు పావడా పావడా
చెక్కు రాసినట్టు లెక్క తీరినట్టు
హక్కులన్ని ఇచ్చుకోవె మందారం
టెక్కుమన్న పట్టు పక్క తీసినట్టు
మూతి ముద్దులిచ్చుకోర బంగారం
హేయ్ అగ్గి పెట్టి చంపమాకె కుర్రకళ్ళ కుంపటి
హేయ్ మత్తులోన లవ్ లారీ స్పీడుగొచ్చి గుద్దినట్టు
కౌగిలిస్తె మెచ్చుకుంటలే..

కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురోయ్.. ఓ...
కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురోయ్.. ఓ...
రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

కింగ్ ఆఫ్ భాంగ్రా అని అభిమానులు పిలుచుకునే దలేర్ మెహాందీ మరోసారి తెలుగు సినిమా అభిమానులను తనదైన ఊపుతో అలరించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా కోసం అతను తాజాగా పాడిన ‘బంతి పూల జానకీ జానకీ... అంత సిగ్గు దేనికీ దేనికీ..’ అనే పాటను ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వంలో ఓ ఊపు ఊపుతోంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమా కోసం దలేర్ మెహందీ పాడిన ‘రబ్బరు గాజులు రబ్బరు గాజులు..’ పాట మంచి హిట్ అయ్యింది. అలాగే ‘బంతిపూల జానకీ.. అంత సిగ్గు దేనికి’ కూడా అంతే హిట్ కొట్టింది.


Monday 5 August 2013

కాటమ రాయుడా..!



చిత్రం              : అత్తారింటికి దారేది (2013)
సంగీతం          : దేవిశ్రీ ప్రసాద్
గానం              : పవన్ కళ్యాణ్
నటీనటులు     : పవన్ కళ్యాణ్, సమంత
దర్శకుడు        : త్రివిక్రమ్ శ్రీనివాస్


Englishlo Ikkada Choodandi


Youtubeలో వీడియో కోసం క్లిక్ చేయండి

కాటమ రాయుడా..!

హేయ్…

కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
మేటైన ఏటకాడ నిన్నే నమ్మీతిరా…
మేటైన ఏటకాడ నిన్నే నమ్మీతిరా…

బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి బుట్టితి 

రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ…
హెయ్… హెయ్… హెయ్…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా…
కోటిమన్ను నీళ్ళలోన యెలసి యేగమై తిరిగి...
కోటిమన్ను నీళ్ళలోన...
హొయ్… హొయ్… హొయ్…

బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదెవరకిచ్చినోడ…
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదెవరకిచ్చినోడ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి బుట్టితి 

రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా…
హో... య్య...


(బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా ’’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ మధ్య పాడిన పాట సోషల్ నెట్‌వర్క్‌లో హల్‌చల్ చేస్తోంది. లక్షల్లో వీక్షకులు యూట్యూబ్‌ని చూసారు. ఎక్కడ చూసినా హమ్ చేస్తున్నారు.

కదిరి పట్టణం అనంతపురం జిల్లాలోనిది. ఇక్కడ కదిరి నరసింహ స్వామి దేవాలయంలో ప్రముఖంగా వినిపించే ఈ పాటను రీమిక్స్ చేసి "అత్తారింటికి దారేది" చిత్రంలో పెట్టారు.

"బేట్రాయి సామి దేవుడా, నన్నేలినోడ..." ఇందులో బేట్రాయి - బేట రాయుడు అంటే వేటకు రాజు - నరసింహ స్వామి. తెలుగులో వ కన్నడంలో బ, తెలుగు ప, కన్నడ హ గా పలకటం మనకి తెలిసిందే. వేట రాయుడు కాస్తా కన్నడ పలుకుబడిలో బేటరాయుడు బేట్రాయుడుగా మారి బేట్రాయి స్వామిగా కొలువులందుకున్నాడు. దీన్నే పాటలో బేట్రాయి సామి దేవుడా, నన్ను ఏలినవాడా అని స్తుతిస్తున్నారు.


ఈ పాట జానపద గీతంగానే కాకుండా.. భజన గీతంగా కూడా రాయలసీమలో ప్రసిద్ధి పొందింది)


Friday 2 August 2013

మా తెలుగు తల్లికి మల్లె పూదండ..!



ఆంధ్ర రాష్ట్ర గీతము
రచన: శ్రీ శంకరంబాడి సుందరాచారి


Englishlo Ikkada Choodandi :)

మా తెలుగు తల్లికి మల్లె పూదండ..!

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

           గల గలా గోదారి కదలి పోతుంటేను
           బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
           బంగారు పంటలే పండుతాయి
           మురిపాల ముత్యాలు దొరలుతాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచియుండే దాక

           రుద్రమ్మ భుజ శక్తి
           మల్లమ్మ పతిభక్తి
           తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
           మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


(ప్రఖ్యాత గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి ఆలాపన ద్వారా అప్పటిలో ఈ గేయం బాగా జనాదరణ పొందింది. సుప్రసిద్ధ దర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యంతో పాడించారు).

Wednesday 31 July 2013

తెలుగు జాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది..!



చిత్రం         : తల్లా! పెళ్లామా! (1970)
సంగీతం     : టీ.వీ. రాజు
రచన         : డా. సి. నారాయణ రెడ్డి
గానం         : ఘంటశాల, ఎన్టీఆర్
నటీనటులు : ఎన్టీఆర్, చంద్రకళ
దర్శకుడు    : నందమూరి తారక రామారావు


Englishlo Ikkada Choodandi :)

తెలుగు జాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది..!

తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది… రాయలసీమ నాది… సర్కారు నాది… నెల్లూరు నాది...
అన్నీ కలిసిన తెలుగునాడు… మనదే… మనదే… మనదేరా...
తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా... మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా... వచ్చాడన్నా... ఆ...
వచ్చిండన్నా... వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా...
తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది... నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది... నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం... ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం... వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి ధీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలు పొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలు పొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది… రాయలసీమ నాది… సర్కారు నాది… నెల్లూరు నాది...
అన్నీ కలిసిన తెలుగునాడు… మనదే… మనదే… మనదేరా...
తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది


Tuesday 30 July 2013

ఆరడుగుల బుల్లెట్టు..!



చిత్రం          : అత్తారింటికి దారేది (2013)
సంగీతం      : దేవిశ్రీ ప్రసాద్
రచన          : శ్రీమణి
గానం          : విజయప్రకాష్, ఎంఎల్ఆర్ కార్తికేయన్
నటీనటులు : పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత
దర్శకుడు    : త్రివిక్రమ్ శ్రీనివాస్


Englishlo Ikkada Choodandi :)

ఆరడుగుల బుల్లెట్టు..!

గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం

భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు తీగె లాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజం
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
శత్రువంటు లేని వింత యుద్ధం
ఇది గుండె లోతు గాయమైన సిద్ధం
నడిచొచ్చే నర్తనశౌరీ  పరిగెత్తే పరాక్రమ సైరీ
హాలాహలం ధరించిన దగ్ధాహృదయుడో

వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం

దివి నుంచి భువి పైకి భగభగమని కురిసేటీ
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడివడిగా వడగళ్ళై దడదడమని జారేటీ
కనిపించని జడివానేగా వీడు
శంఖంలో దాగేటీ పొటెత్తిన సంద్రపు హోరితడు
శోకాన్నే దాచేసే ఆశోకుడు వీడురో

వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకీ
చిగురించిన చోటుని చూపిస్తాడూ
తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికీ       
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో

వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు


గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం

Tuesday 23 July 2013

అమ్మో... బాపుగారి బొమ్మో..!



చిత్రం             : అత్తారింటికి దారేది (2013)
సంగీతం         : దేవిశ్రీ ప్రసాద్
రచన             : రామజోగయ్య శాస్త్రి
గానం             : శంకర్ మహదేవన్
నటీనటులు    : పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత
దర్శకుడు       : త్రివిక్రమ్ శ్రీనివాస్


Englishlo Ikkada Choodandi :)

అమ్మో... బాపుగారి బొమ్మో..!

హే... బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడువంపుల్లో నన్నే తిప్పిందీ
అమ్మో... బాపు గారి బొమ్మో
ఓలమ్మో... మల్లెపూల కొమ్మో
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసిందీ
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్‌ మంక్‌ రమ్మో
పగడాల పెదవులతో పడగొట్టిందీ పిల్లా
కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచిందీ
ఏకంగా ఎద పైనే నర్తించిందీ అబ్బా...
నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది        "అమ్మో..."

మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూని రాగమేదో తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజుకైన వేళ్లు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్‌ తీగై ఒత్తిడి పెంచిందే మల్లా హై
కూరలో వేసే పోపు నా వూహాల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుందీ
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసిందీ
చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసిందీ
పొద్దు పొద్దున్నే హల్లో అంటుంది
పొద్దు పోతే చాలు కల్లో కొస్తుంది
పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది        "అమ్మో..."

ఏ మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసిందీ తాళం పోగొట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగిందీ
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్లీ వూపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజ కుమారి
ఆశలు రేపిన అందాల పోరి
పూసల దండలో నన్నే గుచ్చి మెళ్లో వేసిందీ            "అమ్మో..."


Monday 22 July 2013

నీ జతగా నేనుండాలి..!



చిత్రం          : ఎవడు (2013)
సంగీతం      : దేవీశ్రీప్రసాద్
గానం          : శ్రేయాఘోషల్, కార్తీక్
రచన           : సిరివెన్నెల
నటీనటులు  : రాంచరణ్, శృతీ హాసన్
దర్శకుడు     : వంశీ పైడిపల్లి


Englishlo Ikkada Choodandi :)

నీ జతగా నేనుండాలి..!

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనిండాలి.
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ

నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి
నీదాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్ధం మార్చీ
నేనంటే నువ్వనిపించావే                                                                        "నీ జతగా"

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా
రాలేదే?  జాడైనా లేదే?
రెప్పల బైటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే? పైగా తిడతావే?
లొకంలో లేనట్టే మైకం లో నేనుంటే
వదిలేస్తావ నన్నిలా
నీ లోకం నాకంటే యింకేందో వుందంటే
నమ్మే మాటలా                                                                                    "నీ జతగా"

తెలిసీ తెలియక వాలిందీ
నీ నడుమొంపుల్లో నలిగిందీ నా చూపూ ఏం చేస్తాం చెప్పూ
తోచని తొందర పుడుతోంది
తెగ తుంటరిగా నను నెడుతోందీ నీ వైపూ నీదే ఆ తప్పూ
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ
ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనిండాలి.
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ


Sunday 21 July 2013

డార్లింగే ఓసి నా డార్లింగే..!


 

చిత్రం        : మిర్చి (2013)
సంగీతం     : దేవిశ్రీ ప్రసాద్
గానం        : దేవిశ్రీ ప్రసాద్, గీతా మాధురి
రచన        : రామజోగయ్య శాస్త్రి
నటీనటులు : ప్రభాస్, అనుష్క
దర్శకుడు   : కొరటాల శివ


Englishlo Ikkada Choodandi :)

 డార్లింగే ఓసి నా డార్లింగే..!

నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు
మనసేమో గిల్లా గిల్లా కొట్టెస్కుంటాందే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే
తొక్కమీద కాలేసి నీ ఒళ్లో పడ్డట్టు
మస్తు మస్తు సీనే రాతిరి కల్లోకొచ్చిందే
డార్లింగే ఓరి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే
సచ్చిను బ్యాటే తెచ్చి నన్ను సిక్సరు పీకేసినట్టు
బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే
రబ్బరు మూతే పెట్టి గాజుసీసాలో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తోంది రారో డార్లింగే
ఎహె చేసిన వెయిటింగ్ చాల్లే
ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగే
డార్లింగే ఓసి నా డార్లింగే......డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే........డార్లింగే బెగిరారో డార్లింగే

నువ్వో చిచ్చుబుడ్డి నేనో అగ్గిపుల్లా
రాయే పిల్లా మోగించేద్దాం దీపావళి మోత
నువ్వో కత్తిపీట నేనేమో యాపిలంటా
నీ పర పరా చూపులకోత నాకూ ఇష్టమంటా
గల్ఫు సెంటు బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నావే
ఒంటి నిండా చల్లేస్కుంటా రాయే డార్లింగే
గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి
ప్రేమగా పెంచుకుంటా రారో డార్లింగే
డార్లింగే ఓసి నా డార్లింగే......డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే........డార్లింగే బెగిరారో డార్లింగే

జెళ్లో తురుముకున్న మల్లెపూలదండే నలిగి
విలా విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్దోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం విరిగి
గొల్లుమనే టైము తొందర్లోనే రానున్నాదే బేబీ
ఉట్టిమీది బొబ్బట్టు నోటిలోన పడ్డేట్టు
ఆవురావురంటూ ఏదో చేసెయ్ డార్లింగే
కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు
టేస్టు చూసేస్కుంటా వొచ్చెయ్ డార్లింగే
డార్లింగే ఓసి నా డార్లింగే......డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే........డార్లింగే బెగిరారో డార్లింగే


Thursday 18 July 2013

కాజలు చెల్లివా..!


 

చిత్రం           : బలుపు (2013)
సంగీతం       : ఎస్.ఎస్.థమన్
రచన           : భాస్కరభట్ల రవికుమార్
గానం           : రవితేజ, ఎస్.ఎస్.థమన్
నటీనటులు   : రవితేజ, శృతీ హాసన్, అంజలి
దర్శకుడు      : గోపీచంద్ మలినేని


Englishlo Ikkada Choodandi :)
 
కాజలు చెల్లివా..!

హల్లో బాయ్స్ అండ్ గాళ్స్
దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు
ఆల్ ది యూత్ ఆఫ్ ఏ.పీ.
అమ్మాయిల్ని చూసి
టెంప్టైపోయి మెల్టైపోయి
బాగా దెబ్బయ్‌పోయి...
లైఫ్‌లో హర్టైపోయి మట్టైపోయిన
కుర్రాళ్లందరికీ ఈ పాట అంకితం...

కాజలు చెల్లివా... కరీనాకి కజిన్‌వా
కత్తిరీనా కైపువా... కత్తిలాంటి ఫిగరివా
ఏ.. కాజలు చెల్లివా... కరీనాకి కజిన్‌వా
కత్తిరీనా కైపువా... కత్తిలాంటి ఫిగరివా
అయినా లవ్ చేస్తే పోజే కొడతవే
మనసే నీకిస్తే ఇజ్జద్దీస్తవే
ఎందుకే ఎదవజన్మ ఏటిలోన దూకవే
వినవే కన్యాకుమారి కరేంగె సవారీ
రబనే బనాదీ జోడీ అమ్మడూ అమ్మాడీ        "కాజలు"

నా గుండెల్లోన కుక్కర్‌కేమో మంటెట్టింది నువ్వేగా
విజిలుకొట్టీ పిలుస్తుంటే
పిల్లా విసుక్కుంటావా
ఏయ్... సర్దాపుట్టీ చీమలపుట్ట
లాంటి వాణ్ణి కెలికితే
ఎట్టుంటాదో ఏమవుతాదో
నేడే చూపిస్తా
రాజమౌళి ఈగలాగ
నిన్ను వదిలి పెట్టనే
వినవే కన్యాకుమారి కరేంగె సవారీ
రబనే బనాదీ జోడీ అమ్మడూ అమ్మాడీ

మీరు ప్రేమదోమ తొక్కతోలు ఎన్నో ఎన్నో అంటారే
నీళ్లల్లోకి రాళ్లే రువ్వి కల్లోలాన్నే తెస్తారే
మేం ఇన్నాళ్లుగా దాచుకున్న ఒకే ఒక మనసుతో
గూటీబిళ్ల గోళీకాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింసపెడితే ఉసురుతగిలిపోతరే
వినవే కన్యాకుమారి కరేంగె సవారీ
రబనే బనాదీ జోడీ అమ్మడూ అమ్మాడీ


Wednesday 17 July 2013

ఆకాశం అమ్మాయైతే..!



చిత్రం          : గబ్బర్‌సింగ్ (2012)
రచన          : చంద్రబోస్
సంగీతం      : దేవిశ్రీ ప్రసాద్
గానం          : శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ
నటీనటులు : పవన్ కళ్యాణ్, శృతీ హాసన్
దర్శకుడు    : హరీష్ శంకర్


Englishlo Ikkada Choodandi :)

ఆకాశం అమ్మాయైతే..!

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం

ఓ... ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే
ఓ... ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే
వానల్లె నువ్వు జారగా నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమౌతుందే
హోలా హోలా హోలా హోలా
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా
హోలా హోలా హోలా హోలా
ఇక చాలా చాలా జరిగే నీ వల్లా

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం

అల్లేసి నను గిల్లేసి తెగ నవ్వినావె సుగుణాల రాక్షసి శత్రువంటి ప్రేయసి
పట్టేసి కనికట్టేసి దడ పెంచినావె దయ లేని ఊర్వశి దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే నిద్దుర పుచ్చేనే
ఓ... లోకంలో అందాలన్నీ నీలో చేరేనే నిద్దుర లేపేనే
హోలా హోలా హోలా హోలా
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా
హోలా హోలా హోలా హోలా
ఇక చాలా చాలా జరిగే నీ వల్లా

ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీ వల్లే ఇంతానందం గుండెల్లో కదిలింది పూల రథం

వచ్చేసి బతికిచ్చేసి మసి చేసినావె రుషిలాంటి నా రుచి మార్చినావె అభిరుచి
సిగ్గేసి చలి మొగ్గేసి ఉసి గొలిపినావె సరిగమగ పదనిసి చేర్చినావె ఓ అగసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే
ఓ...నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే
హోలా హోలా...హోలా హోలా
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా
హోలా హోలా...హోలా హోలా
ఇక చాలా చాలా జరిగే నీ వల్లా

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం


Tuesday 16 July 2013

ఇదేదో బాగుందే చెలీ..!


చిత్రం        : మిర్చి (2013)
సంగీతం     : దేవిశ్రీ ప్రసాద్
గానం        : విజయ్ ప్రకాష్, అనిత
రచన        : రామజోగయ్య శాస్త్రి
నటీనటులు : ప్రభాస్, అనుష్క
దర్శకుడు   : కొరటాల శివ


Englishlo Ikkada Choodandi :)
 

ఇదేదో బాగుందే చెలీ..!

కాటుక కళ్లను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
లాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగ ఇంతందాన్ని చూశానే అనిపిస్తుందే
నా మనసే నీవైపొస్తుందే


ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే
ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే
ఇలాగే ఇంకాస్సేపంటోంది
 

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తెలుసుకుంటావా తెలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
చూసీ చూడంగానే చెప్పింది ప్రాణం
నేన్నీదాన్నైపోయానని

ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తరచి చూస్తూనే తరగదంటున్నా
తళుకు వర్ణాల నీ మేను పూల గని
నలిగిపోతూనే వెలిగిపోతున్నా
తనివితీరేట్టు సంధించు చూపులన్నీ
కంటి రెప్పలు రెండూ పెదవుల్లా మారి
నిన్నే తినేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరి
నీకోసం ఏదైనా సరే

ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి


Friday 12 July 2013

మాటకందని పాటగా..!



చిత్రం          : మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు (2013)
గానం          : నిత్య సంతోషిని
రచన          : ఉమా మహేశ్వర రావు
సంగీతం      : పవన్ కుమార్
నటీనటులు : క్రాంతి చంద్, శ్రీదివ్య
దర్శకుడు    : రామరాజు


Englishlo Ikkada Choodandi :)

మాట కందని పాటగా..!

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాట కందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా                                   "మాట"

తూరుపు వెలుగుల,పడమటి జిలుగుల పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుస్సున ఇద్దరమే
చీకటి నలుపున మనమే,చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు,అలసట ఎరుగని నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!                                              "మాట"

స్వచ్ఛపు తొలకరి, వెచ్చని జల్లుల, పచ్చని కాంతులలో మనమే
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటలమనమే
నింగి నేల చిన్నబోయి రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతం ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియ కథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరస్సులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాటకందని పాటగా మనమిద్దరమూ కలిసాముగా

Tuesday 25 June 2013

ఎటో వెళ్ళిపోయింది మనసు...!!



 చిత్రం          : నిన్నే పెళ్ళాడుతా (1996)
గానం          : రాజేష్
రచన          : సిరివెన్నెల
సంగీతం      : సందీప్ చౌతా

నటీనటులు : నాగార్జున, టబు
దర్శకుడు    : క్రిష్ణవంశీ

Englishlo Ikkada Choodandi :)

ఎటో వెళ్ళిపోయింది మనసు...!!

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏవిటో.

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభముంది
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటె జీవితం ఎంతో వెదుకుతుంది అంటూ..

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

ఆహాహాహాహా మనసు ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఆహాహాహాహా
 

చలి చలిగా అల్లింది...!!


 
 
చిత్రం : మిస్టర్ ఫర్‌ఫెక్ట్ (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : శ్రేయా ఘోషల్
నటీనటులు : ప్రభాస్, కాజల్ అగర్వాల్


Englishlo Ikkada Choodandi... :)

చలి చలిగా అల్లింది...!!


చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు

చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది వయసు

గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీది నాది
తలపులు వేరైనా కలవని తీరైనా
బలపడిపోతుందే ఉండే కొద్ది
లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశం పైకి వెళుతున్నట్టు
తారలన్నితారస పడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు


చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది వయసు

 
నీపై కోపాన్ని ఎందరి ముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా

తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతోస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు


Monday 24 June 2013

అమ్మాయి ముద్దు ఇవ్వందే...!!



చిత్రం : క్షణక్షణం (1991)
సంగీతం : కీరవాణి
గీత రచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర


Englishlo lyrics kosam ikkada Choodandi :)

అమ్మాయి ముద్దు ఇవ్వందే...!!

త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త "2"

అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మమ్మో గొడవలే

ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా

ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా

మోజు లేదనకు, ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకు, చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
చూడదా సహించని వెన్నెల దహించిన కన్నుల
కళ్ళు మూసేసుకో హాయిగా....
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే

పారిపోను కదా, అది సరే అసలు కథ అవ్వాలి కదా
ఏది ఆ సరదా, అన్నిటికి సిద్దపడే వచ్చాను కదా
అందుకే అటూ ఇటు చూడకు సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు

ముద్దిమ్మంది బుగ్గా వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గా అగ్గల్లే వస్తే ఆగేదెట్టా హద్దుపద్దు వద్దా
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గా వద్దంటు అడ్డంరాకే నువ్వు సిగ్గే లేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గా అగ్గల్లే వస్తే ఆగేదెట్టా హద్దు పద్దు వద్దా......


Sunday 23 June 2013

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు..!!

 

చిత్రం : శివ (1989)
డైరెక్టర్ : రాంగోపాల్ వర్మ
సంగీతం : ఇళయరాజా
గాయనీ గాయకులు : మనో, జానకి
నటీనటులు : నాగార్జున, అమల


Englishlo ikkada Choodandi :-) 

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు..!!


సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు..
విరహాల గోల ఇంకా నా వీలు కాదు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు..
విరహాల గోల ఇంకా నా వీలు కాదు
వంటింట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారూ...
చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు....

సూర్యుడే చుర చుర చూసినా చీరనే వదలరు చీకటే చెదిరినా ..
కాకులే కేకలు వేసినా కౌగిలె వదలను వాకిలే పిలిచినా...
స్నానానికి సాయమే రావాలని తగువా...
నీ చూపులే సోపుగా కావాలనే సరదా..
పాపిడి తీసి, పౌడరు పూసి బయటకి పంపేయనా...
పైటతోపాటే లోనికి రానా పాపలా పారాడనా...
తియ్యగా తిడుతూనే లాలించనా....
సరసాలు చాలు శ్రీవారు తాననాన
విరహాల గోల ఇంకానా ఊహు హుహు

కొత్తగా ముదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా...
ఎందుకో తికమక తొందరా బొత్తిగా కుదురుగ ఉండనే ఉండరా...
ఆరారగా చేరక తీరేదెల గొడవ..
ఆరాటమే ఆరగా సాయంత్రమే పడదా...
మోహామే తీరే మూర్తమే రాదా మోజులే చెల్లించవా..
జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇకా...
ఆగదే అందాక ఈడు గోలా...
చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు....
ఊరించే దూరాలు ఊ అంటే తీయంగా తీరు...
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు...
లల లాల లాలాల లాల లాల

Thursday 20 June 2013

ఎప్పుడైతే పుట్టిందో...!!




చిత్రం : పైసా (2013)
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : నాని, కత్రినే త్రేష
గాయకులు : క్రిష్ణ వంశీ, విఠ్ఠల్, వేణు, ధనరాజ్, రమేష్ చంద్ర.


ఇంగ్లీషులో లిరిక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. :)

ఎప్పుడైతే పుట్టిందో...!!


ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ
దాని చిటికెనేలు పట్టుకొని వెంటపడింది వచ్చింది పైసా

ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గానీ పైసా
పచ్చిగాలి మానేసి దాన్నే పీల్చుకుంటోంది శ్వాస పైసా..
 

గల గలగలమంటుంటే పైసా
దిల్లంతా ఏంటో దిలాషా
కళ్ల పడకుంటే పైసా పైసా
గల్లంతై పోదా కులాసా పైసా

యాతా వాతా ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస
పైసా పైసా పైసా పైసా పైసా పైసా

చిటికెడు నవ్వుల కిటికీ పైసా
కడివెడు కన్నీళ్ల గుటకే పైసా
చారెడు చెమటల ఖరీదు పైసా
బారెడు నిట్టూర్పు రసీదు పైసా
ఆకలి వేటకి ఎర ఈ పైసా
ఊహల పాటకి దరువు ఈ పైసా
పండని పంటల ఎరువు ఈ పైసా
అందని ద్రాక్షల పులుపు ఈ పైసా
బలమున్నోళ్లకి బానిస పైసా
బాంచెన్ గాళ్లకి బాసీ పైసా
దొరక్కపోతే సమస్య పైసా
అరక్కపోతే చికిత్స పైసా
ఉగ్గుకి పైసా పెగ్గుకి పైసా
శక్తికి పైసా ముక్తికి పైసా
నేలకి పైసా గాలికి పైసా
నీటికి పైసా నిప్పుకి పైసా

ఎన్నన్నా ఎన్ననుకున్నా
ఉన్నది ఒకటే తెలుసా పైసా పైసా

అక్కరకొచ్చే ఆప్తుడు పైసా
చిక్కులు తెచ్చే ధూర్తుడు పైసా
ఫాటల్ అట్రాక్షన్ రా పైసా
టోటల్ డిస్ట్రాక్షన్ రా పైసా
ఆత్మబంధువుల హారం పైసా
అనుబంధాల దారం పైసా
తేడా వస్తే అర్ధాలన్నీ
తలకిందయ్యే తమాషా పైసా

ఆహాహా సంతోషం పైసా
ఆహాహా ఆక్రోషం పైసా
ఓహోహో సౌందర్యం పైసా
ఔరౌరా ఆశ్చర్యం పైసా
ప్రాణం తీసే పాపం పైసా
దానం చేసే పుణ్యం పైసా
ఇహము పైసా పరము పైసా
రుణము పైసా ధనము పైసా
ఒప్పు పైసా తప్పు పైసా
భయము పైసా... అభయము పైసా
మానవులంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ భాష
పైసా పైసా పైసా