Tuesday 25 June 2013

ఎటో వెళ్ళిపోయింది మనసు...!!



 చిత్రం          : నిన్నే పెళ్ళాడుతా (1996)
గానం          : రాజేష్
రచన          : సిరివెన్నెల
సంగీతం      : సందీప్ చౌతా

నటీనటులు : నాగార్జున, టబు
దర్శకుడు    : క్రిష్ణవంశీ

Englishlo Ikkada Choodandi :)

ఎటో వెళ్ళిపోయింది మనసు...!!

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏవిటో.

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభముంది
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటె జీవితం ఎంతో వెదుకుతుంది అంటూ..

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

ఆహాహాహాహా మనసు ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఆహాహాహాహా
 

చలి చలిగా అల్లింది...!!


 
 
చిత్రం : మిస్టర్ ఫర్‌ఫెక్ట్ (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : శ్రేయా ఘోషల్
నటీనటులు : ప్రభాస్, కాజల్ అగర్వాల్


Englishlo Ikkada Choodandi... :)

చలి చలిగా అల్లింది...!!


చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు

చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది వయసు

గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీది నాది
తలపులు వేరైనా కలవని తీరైనా
బలపడిపోతుందే ఉండే కొద్ది
లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశం పైకి వెళుతున్నట్టు
తారలన్నితారస పడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు


చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది వయసు

 
నీపై కోపాన్ని ఎందరి ముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా

తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతోస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు


Monday 24 June 2013

అమ్మాయి ముద్దు ఇవ్వందే...!!



చిత్రం : క్షణక్షణం (1991)
సంగీతం : కీరవాణి
గీత రచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, చిత్ర


Englishlo lyrics kosam ikkada Choodandi :)

అమ్మాయి ముద్దు ఇవ్వందే...!!

త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త "2"

అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మమ్మో గొడవలే

ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా

ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా

మోజు లేదనకు, ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకు, చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
చూడదా సహించని వెన్నెల దహించిన కన్నుల
కళ్ళు మూసేసుకో హాయిగా....
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే

పారిపోను కదా, అది సరే అసలు కథ అవ్వాలి కదా
ఏది ఆ సరదా, అన్నిటికి సిద్దపడే వచ్చాను కదా
అందుకే అటూ ఇటు చూడకు సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు

ముద్దిమ్మంది బుగ్గా వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గా అగ్గల్లే వస్తే ఆగేదెట్టా హద్దుపద్దు వద్దా
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గా వద్దంటు అడ్డంరాకే నువ్వు సిగ్గే లేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గా అగ్గల్లే వస్తే ఆగేదెట్టా హద్దు పద్దు వద్దా......


Sunday 23 June 2013

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు..!!

 

చిత్రం : శివ (1989)
డైరెక్టర్ : రాంగోపాల్ వర్మ
సంగీతం : ఇళయరాజా
గాయనీ గాయకులు : మనో, జానకి
నటీనటులు : నాగార్జున, అమల


Englishlo ikkada Choodandi :-) 

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు..!!


సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు..
విరహాల గోల ఇంకా నా వీలు కాదు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు..
విరహాల గోల ఇంకా నా వీలు కాదు
వంటింట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారూ...
చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు....

సూర్యుడే చుర చుర చూసినా చీరనే వదలరు చీకటే చెదిరినా ..
కాకులే కేకలు వేసినా కౌగిలె వదలను వాకిలే పిలిచినా...
స్నానానికి సాయమే రావాలని తగువా...
నీ చూపులే సోపుగా కావాలనే సరదా..
పాపిడి తీసి, పౌడరు పూసి బయటకి పంపేయనా...
పైటతోపాటే లోనికి రానా పాపలా పారాడనా...
తియ్యగా తిడుతూనే లాలించనా....
సరసాలు చాలు శ్రీవారు తాననాన
విరహాల గోల ఇంకానా ఊహు హుహు

కొత్తగా ముదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా...
ఎందుకో తికమక తొందరా బొత్తిగా కుదురుగ ఉండనే ఉండరా...
ఆరారగా చేరక తీరేదెల గొడవ..
ఆరాటమే ఆరగా సాయంత్రమే పడదా...
మోహామే తీరే మూర్తమే రాదా మోజులే చెల్లించవా..
జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇకా...
ఆగదే అందాక ఈడు గోలా...
చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు....
ఊరించే దూరాలు ఊ అంటే తీయంగా తీరు...
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు...
లల లాల లాలాల లాల లాల

Thursday 20 June 2013

ఎప్పుడైతే పుట్టిందో...!!




చిత్రం : పైసా (2013)
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : నాని, కత్రినే త్రేష
గాయకులు : క్రిష్ణ వంశీ, విఠ్ఠల్, వేణు, ధనరాజ్, రమేష్ చంద్ర.


ఇంగ్లీషులో లిరిక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. :)

ఎప్పుడైతే పుట్టిందో...!!


ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ
దాని చిటికెనేలు పట్టుకొని వెంటపడింది వచ్చింది పైసా

ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గానీ పైసా
పచ్చిగాలి మానేసి దాన్నే పీల్చుకుంటోంది శ్వాస పైసా..
 

గల గలగలమంటుంటే పైసా
దిల్లంతా ఏంటో దిలాషా
కళ్ల పడకుంటే పైసా పైసా
గల్లంతై పోదా కులాసా పైసా

యాతా వాతా ఏమిటంటే అందరిది ఒకటే ధ్యాస
పైసా పైసా పైసా పైసా పైసా పైసా

చిటికెడు నవ్వుల కిటికీ పైసా
కడివెడు కన్నీళ్ల గుటకే పైసా
చారెడు చెమటల ఖరీదు పైసా
బారెడు నిట్టూర్పు రసీదు పైసా
ఆకలి వేటకి ఎర ఈ పైసా
ఊహల పాటకి దరువు ఈ పైసా
పండని పంటల ఎరువు ఈ పైసా
అందని ద్రాక్షల పులుపు ఈ పైసా
బలమున్నోళ్లకి బానిస పైసా
బాంచెన్ గాళ్లకి బాసీ పైసా
దొరక్కపోతే సమస్య పైసా
అరక్కపోతే చికిత్స పైసా
ఉగ్గుకి పైసా పెగ్గుకి పైసా
శక్తికి పైసా ముక్తికి పైసా
నేలకి పైసా గాలికి పైసా
నీటికి పైసా నిప్పుకి పైసా

ఎన్నన్నా ఎన్ననుకున్నా
ఉన్నది ఒకటే తెలుసా పైసా పైసా

అక్కరకొచ్చే ఆప్తుడు పైసా
చిక్కులు తెచ్చే ధూర్తుడు పైసా
ఫాటల్ అట్రాక్షన్ రా పైసా
టోటల్ డిస్ట్రాక్షన్ రా పైసా
ఆత్మబంధువుల హారం పైసా
అనుబంధాల దారం పైసా
తేడా వస్తే అర్ధాలన్నీ
తలకిందయ్యే తమాషా పైసా

ఆహాహా సంతోషం పైసా
ఆహాహా ఆక్రోషం పైసా
ఓహోహో సౌందర్యం పైసా
ఔరౌరా ఆశ్చర్యం పైసా
ప్రాణం తీసే పాపం పైసా
దానం చేసే పుణ్యం పైసా
ఇహము పైసా పరము పైసా
రుణము పైసా ధనము పైసా
ఒప్పు పైసా తప్పు పైసా
భయము పైసా... అభయము పైసా
మానవులంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ భాష
పైసా పైసా పైసా