Monday 12 August 2013

మనసే అందాల బృందావనం..!



చిత్రం           : మంచి కుటుంబం (1968)
సంగీతం       : ఎస్పీ కోదండపాణి
రచన           : ఆరుద్ర
గానం           : పి. సుశీల
నటీనటులు  : కృష్ణ, కాంచన
దర్శకుడు     : వి. మధుసూధనరావు


Englishlo Ikkada Choodandi :)

మనసే అందాల బృందావనం..!

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

రాధను ఒక వంక లాలింతునే
సత్యభామను మురిపాల తేలింతునే
రాధను ఒక వంక లాలింతునే
సత్యభామను మురిపాల తేలింతునే
మనసార నెరనమ్ము తనవారినే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ....
మనసార నెరనమ్ము తనవారినే
కోటి మరులందు సుధలందు తనియింతునే..

మనసే అందాల బృందావనం
దనిస దని నిదదమ
మదని నిదదమ
గమద దమమగస
గగ మమ మగస దని
గసా మగా దమా నిద
గమదనిస బృందావనం

మాద మగస
దామ గమద
నీద నిసమ
గమ మద దనినిస
నిసమద మగస
గమ దనిసగ బృందావనం

సమగస గమదని
గదమగ మదనిస
మనిద మదనిస
ఆ...........

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం


Tuesday 6 August 2013

బంతి పూల జానకీ జానకీ..!



చిత్రం : బాద్ షా  (2013)
సంగీతం : తమన్ ఎస్.ఎస్.
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : దలేర్ మెహందీ , రాణినా రెడ్డి
నటీనటులు : జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్
దర్శకుడు : శ్రీను వైట్ల

Englishlo Ikkada Choodandi :)

బంతి పూల జానకీ జానకీ..!

కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురోయి

రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

ఆ బంతి పూల జానకీ జానకీ
నీకంత సిగ్గు దేనికి దేనికి
ఛలో లో నాతో వచ్చేయ్ అత్తారింటికి

రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

అ బంతి పూల జానకీ జానకీ
నీకంత సిగ్గు దేనికీ..
హేయ్ ఆకు వక్క సున్నముంది
నోరు పండడానికి
హేయ్ ఆడ ఈడ ముందరుంది
నీకు చెందడానికి
హేయ్ పుట్ట మీద తేనె పట్టు
మట్టిలోకి జారినట్టు
సోకులన్ని పిండుకుంటనే..

హేయ్ కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రోయ్.. ఓ...
హేయ్ కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రోయ్.. ఓ...

రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

చాపకింద నీరులాగ చల్లగా చల్లగా
చెంతకొచ్చినావు చెంప గిల్లగా గిల్లగా
చాప ముల్లు గుచ్చినావె మెల్లగా.. 
పాతికేళ్ల గుండె పొంగి పొర్లదా పొర్లదా
చూపులో ఫిరంగి గుళ్ల జల్లుగా
సిగ్గులన్ని పేల్చినావు ఫుల్లుగా ఫుల్లుగా
సంకురాత్రి కోడి సుర్ర కత్తి గట్టి 
దూకు దూకు దూకుతాందె కారంగా
శంకు మార్కు లుంగి పైకి ఎత్తి కట్టి
ఎత్తుకెళ్లిపోర నన్ను ఏకంగా
హేయ్.. ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్త మీదికి
ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారు గుట్టు మట్టు 
నిన్ను చూసి ఫట్టుమందిరో.. 

కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రోయ్.. ఓ...
కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడు రోయ్.. ఓ...
రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

అంతలేసి తొందరేంది పిల్లడా పిల్లడా
అందమంత పట్టినావు జల్లెడా జల్లెడా
కొంగు పట్టులోని పాల మీగడా
ఆకలేసి నంజుకోన అక్కడా అక్కడా
నీకు లాంటి పిల్లగాన్ని ఎక్కడా
చూడలేదె కంచిపట్టు పావడా పావడా
చెక్కు రాసినట్టు లెక్క తీరినట్టు
హక్కులన్ని ఇచ్చుకోవె మందారం
టెక్కుమన్న పట్టు పక్క తీసినట్టు
మూతి ముద్దులిచ్చుకోర బంగారం
హేయ్ అగ్గి పెట్టి చంపమాకె కుర్రకళ్ళ కుంపటి
హేయ్ మత్తులోన లవ్ లారీ స్పీడుగొచ్చి గుద్దినట్టు
కౌగిలిస్తె మెచ్చుకుంటలే..

కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురోయ్.. ఓ...
కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా
నువ్వు నాకు నచ్చినోడురోయ్.. ఓ...
రాం జై రాం జై రాం జై రాం జై
రాం జై రాం జై రాం జై రాం జై

కింగ్ ఆఫ్ భాంగ్రా అని అభిమానులు పిలుచుకునే దలేర్ మెహాందీ మరోసారి తెలుగు సినిమా అభిమానులను తనదైన ఊపుతో అలరించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా కోసం అతను తాజాగా పాడిన ‘బంతి పూల జానకీ జానకీ... అంత సిగ్గు దేనికీ దేనికీ..’ అనే పాటను ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వంలో ఓ ఊపు ఊపుతోంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమా కోసం దలేర్ మెహందీ పాడిన ‘రబ్బరు గాజులు రబ్బరు గాజులు..’ పాట మంచి హిట్ అయ్యింది. అలాగే ‘బంతిపూల జానకీ.. అంత సిగ్గు దేనికి’ కూడా అంతే హిట్ కొట్టింది.


Monday 5 August 2013

కాటమ రాయుడా..!



చిత్రం              : అత్తారింటికి దారేది (2013)
సంగీతం          : దేవిశ్రీ ప్రసాద్
గానం              : పవన్ కళ్యాణ్
నటీనటులు     : పవన్ కళ్యాణ్, సమంత
దర్శకుడు        : త్రివిక్రమ్ శ్రీనివాస్


Englishlo Ikkada Choodandi


Youtubeలో వీడియో కోసం క్లిక్ చేయండి

కాటమ రాయుడా..!

హేయ్…

కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
మేటైన ఏటకాడ నిన్నే నమ్మీతిరా…
మేటైన ఏటకాడ నిన్నే నమ్మీతిరా…

బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి బుట్టితి 

రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ…
హెయ్… హెయ్… హెయ్…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా…
కోటిమన్ను నీళ్ళలోన యెలసి యేగమై తిరిగి...
కోటిమన్ను నీళ్ళలోన...
హొయ్… హొయ్… హొయ్…

బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదెవరకిచ్చినోడ…
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదెవరకిచ్చినోడ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి బుట్టితి 

రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా…
హో... య్య...


(బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా ’’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ మధ్య పాడిన పాట సోషల్ నెట్‌వర్క్‌లో హల్‌చల్ చేస్తోంది. లక్షల్లో వీక్షకులు యూట్యూబ్‌ని చూసారు. ఎక్కడ చూసినా హమ్ చేస్తున్నారు.

కదిరి పట్టణం అనంతపురం జిల్లాలోనిది. ఇక్కడ కదిరి నరసింహ స్వామి దేవాలయంలో ప్రముఖంగా వినిపించే ఈ పాటను రీమిక్స్ చేసి "అత్తారింటికి దారేది" చిత్రంలో పెట్టారు.

"బేట్రాయి సామి దేవుడా, నన్నేలినోడ..." ఇందులో బేట్రాయి - బేట రాయుడు అంటే వేటకు రాజు - నరసింహ స్వామి. తెలుగులో వ కన్నడంలో బ, తెలుగు ప, కన్నడ హ గా పలకటం మనకి తెలిసిందే. వేట రాయుడు కాస్తా కన్నడ పలుకుబడిలో బేటరాయుడు బేట్రాయుడుగా మారి బేట్రాయి స్వామిగా కొలువులందుకున్నాడు. దీన్నే పాటలో బేట్రాయి సామి దేవుడా, నన్ను ఏలినవాడా అని స్తుతిస్తున్నారు.


ఈ పాట జానపద గీతంగానే కాకుండా.. భజన గీతంగా కూడా రాయలసీమలో ప్రసిద్ధి పొందింది)


Friday 2 August 2013

మా తెలుగు తల్లికి మల్లె పూదండ..!



ఆంధ్ర రాష్ట్ర గీతము
రచన: శ్రీ శంకరంబాడి సుందరాచారి


Englishlo Ikkada Choodandi :)

మా తెలుగు తల్లికి మల్లె పూదండ..!

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

           గల గలా గోదారి కదలి పోతుంటేను
           బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
           బంగారు పంటలే పండుతాయి
           మురిపాల ముత్యాలు దొరలుతాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచియుండే దాక

           రుద్రమ్మ భుజ శక్తి
           మల్లమ్మ పతిభక్తి
           తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
           మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


(ప్రఖ్యాత గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి ఆలాపన ద్వారా అప్పటిలో ఈ గేయం బాగా జనాదరణ పొందింది. సుప్రసిద్ధ దర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యంతో పాడించారు).